Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎఫెక్ట్‌... ఉద్దానంలో ప్ర‌జల కష్టాలు తీరుస్తామన్న కేంద్రమంత్రి జేపీ న‌డ్డా

శ్రీ‌కాకుళం జిల్లాలోని ఉద్దానంలో ఎన్నో ఏళ్లుగా కిడ్నీ బాధితులు ప‌డుతున్న బాధ‌ల‌ను జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌భుత్వానికి వినిపించిన సంగ‌తి తెలిసిందే. ఆ ప్ర‌భావంతో కిడ్నీ బాధితుల బాధ‌ల‌ను తీర్చ‌డానికి ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఉద్దానంలో ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తామ‌ని చెప్పారు. ఈ రోజు కేంద్ర మంత్రి జేపీ న‌డ్డా కూడా ఆ అంశంపై స్పందించారు. అక్క‌డి ప్ర‌జ‌ల‌కు కిడ్నీ వ్యాధులు రావ‌డానికి మూల‌కార‌ణాలేంటో తెలుసుకోవడానికి ప్ర‌త్యేక టీమ్‌ను పంపిస్తామ‌ని చెప్పారు. ఐసీఎంఆర్ ఆధ్వ‌ర్యంలో ఈ టీమ్ ఉద్దానంకు చేరుకుంటుంద‌ని చెప్పారు. ఉద్దానంలో ప్ర‌త్యేకంగా డ‌యాలిసిన్ కేంద్రం ఏర్పాటు చేస్తామ‌ని, బాధితుల కష్టాలు తీరుస్తామని పేర్కొన్నారు. 
Jagat Prakash Nadda

More Telugu News